డిజిటల్ లైబ్రరీ..76 లక్షల పుస్తకాలుFri,May 19, 2017 10:49 PM
డిజిటల్ లైబ్రరీ..76 లక్షల పుస్తకాలు


శాస్త్ర సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుండడంతో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏ పుస్తకం కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా లైబ్రరీకి వెళ్లి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొబైల్ చేతిలో ఉంటే చాలు..ఏ సమాచారమైనా, ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసిపోతోంది. ప్రజల సౌకర్యార్థం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, ఖరగ్‌పూర్ ఐఐటీ సంయుక్తంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించాయి. దీనిలో 70కి పైగా భాషల్లో, 76 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఇది ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తం.

సొరుగులో ఉన్న పుస్తకాన్ని తీసి చదివే రోజులు ఒకప్పుడు.. ఇప్పుడు జేబులో మొబైల్ ఉంటే చాలు.. అరచేతిలోనే డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. అందులో లెక్కకు మించి పుస్తకాలుంటాయి. పలు భాషల్లో కేజీ నుంచి పీజీ వరకు అందరూ ఉచితంగా చదువుకోవచ్చు. తలవంచుకొని నన్ను చదువు.. నిన్ను తలెత్తుకునేలా చేస్తా అని పుస్తకం చెప్పే మాటల్లో ఎలాం టి సందేహం లేదు. అంతటి విజ్ఞాన్ని అందించే పుస్తకాల్ని మరింత సులవైన పద్ధతిలో విద్యార్థులకు, నిరుద్యోగులకు దగ్గర చేసేలా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, ఖరగ్‌పూర్ ఐఐటీ సంయుక్తంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించాయి. దీనిలో 70కి పైగా భాషల్లో, 76 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉం డే లా ఏర్పాటు చేశారు. రంగం ఏదైనా.. కావాలనుకునే సమాచారం ఎలాంటిదైనా, అక్షర, శ్రవణ, దృశ్య రూపకంలో క్షణాల్లో అందుకునే అవకాశం ఉంది. ఇది అంతా ఉచిత మే. National Digi tal Library of India వెబ్ సైట్‌లో సభ్యులైతే చాలు.
అంశాల వారీగా..
కేజీ నుంచి పీజీ వరకు ఏ విద్యార్థికై నా అవసమ య్యే, మూడు లక్షల మంది రచయితలు రాసిన ఏడు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో తెలుగులో ఒకటి నుంచి పదో తరగతి వరకు గణితం, సైన్స్‌తో పాటు వైజ్ఞానిక విషయాలు, ప్రాచీన సాహిత్యాధ్యాయనం, బాలావాజ్ఞయం తదితర కథల పుస్తకాలు పొందు పరిచారు.

దేశంలోని విశ్వవిద్యాలయాలు, సమకాలీన అంశాలపై చేసిన 95 వేలకు పైబడిన పరిశోధనలు, ఆవిష్కరణలు, సత్యజిత్ సొసైటీ, విద్యాప్రకాశ్ మండల్‌తో పాటు మరికొంత మంది ప్రముఖుల వ్యాసాలున్నాయి. వీరితో పాటు తెలుగులోని పోతన భాగవతం, తెలుగు దిన పత్రికల్లోని భాష ఆధునీకరణ తదితర అంశాలపై చేసిన రచనలున్నాయి.

రెండు లక్షల మంది రాసిన మూడు లక్షల పరిశోధనాత్మక కథనాలున్నాయి. ఇవి పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసిన వారికి ఉపయోగపడుతాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. సివిల్స్, తదితరాలకు చెందిన 33వేల ప్రశ్నపత్రాలు, వాటి సందేహాలు, నిపుణుల ద్వారాసమాధానాలు లభ్యమవుతాయి. వ్యవసాయ, భౌతికశాస్త్ర సాంకేతిక అంశాలపై వెబ్ కోర్సులున్నాయి.
digital-lry

సభ్యత్వ నమోదు ఇలా..
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని టైప్‌చేసి వెతికితే అధికారిక వెబ్‌సైట్ వస్తుంది. https ndl.iitkgp ac.in లింక్‌లో సైట్ ప్రత్యక్షమవుతుంది. సైట్ హోం పేజీ కింది భాగంలో మెంబర్ లాగిన్ అని ఆకుపచ్చ రంగులో కన్పిస్తుంది. మనం వాడుతున్న ఈ మెయిల్ చిరునామాతో సైట్‌లో సభ్యులమవ్వాలి. అప్పుడు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లోనూ యాప్ రూపంలో నిక్షిప్తం చేసుకొని డిజిటల్ లైబ్రరీని పొందే వీలుంది.

గ్రామీణ విద్యార్థులకు విలువైన వేదిక..
దేశంలోనే అత్యుత్తమ పరీక్షలైన సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే చాలామంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇదో చక్కని వేదిక. ఆయా పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు, వ్యాసాలు, ఈ డిజిటల్ లైబ్రరీలో వెతికి చదువుకోవచ్చు. దీంతో విద్యార్థుల ప్రతిభ మరింత పెరుగుతుంది. ఎంసెట్, నిట్, గేట్, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాసే వారికి అవసరమైన, విలువైన సమాచారం క్షణాల్లో మన ముందుంచింది మన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ.

1149
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS