చెరువులో పడి బాలుడి మృతి

Fri,October 12, 2018 09:01 PM

7-Year-Old Boy Dies After Drowning In Lake

పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో చెరువులో పడి ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర రజిత, సంతోష్‌ల పెద్ద కుమారుడు రోహిత్(07) కల్లెడ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. శుక్రవారం బాలుడు రోహిత్ ఆడు కోవడానికి స్నేహితులతో కలసి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఆడుకోవడానికి వెళ్లిన కుమారుడు చెరువులో శవమై తేలడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చెరువులో లోతైన గుంతలు ఉన్నాయనే హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి బాలుడు చనిపోయాడని పలువురు ఆరోపిస్తున్నారు.

1719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS