నగరంలో పోలీసుల తనిఖీలు..రూ.7 కోట్ల నగదు పట్టివేత

Wed,November 7, 2018 01:29 PM

7 CRORES SEIZED FROM THREE PLACES IN HYDERABAD

హైదరాబాద్ : ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అక్రమ నగదు తరలింపుపై పోలీసు శాఖ నిఘా పెట్టింది. ఇందులోభాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగర పోలీసులు హైదరాబాద్‌ని వివిధ ప్రాంతాల్లో ఇవాళ వాహన తనిఖీలు చేపట్టారు. మొత్తం మూడు ప్రాంతాల్లో కలిపి రూ.7,71,25,150 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.5 కోట్ల నగదును సైఫాబాద్‌ పోలీసులు సీజ్ చేశారు.

నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా బంజారాహిల్స్‌, షాఇనాయత్‌గంజ్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల 71లక్షల 25వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది హవాలా సొమ్ము అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

2708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles