ఖమ్మం మార్కెట్‌కు ఒకే రోజు 60 వేల మిర్చి బస్తాలు రాక

Thu,February 28, 2019 06:12 PM

60 thousand mirchi bags brought to khammam agriculture market

ఖమ్మం: గత కొద్ది రోజుల నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి బస్తాల తాకిడి పెరుగుకుంటూ వస్తోంది. గురువారం ఒక్క రోజే దాదాపు 60 వేల బస్తాల రాకతో మార్కెట్‌లోని ప్రధాన యార్డు మిర్చి బస్తాలతో కిక్కిరిసిపోయింది. బుధవారం సాయంత్రం నుంచి ఖమ్మం జిల్లా రైతాంగంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి రైతులు పంటను తీసుకువచ్చారు.

దీంతో అప్రమత్తమైన జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సంతోష్‌ కుమార్ మార్కెట్ సిబ్బందితో కలిసి ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం జరిగిన జెండా పాటలో గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.9,300 పలుకగా, మధ్యధర రూ.8,500 కాగా కనిష్ట ధర రూ.7,300 పలికింది. సకాలంలో కాంటాల ప్రక్రియ ముగియడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు సైతం ఉపశమనం పొందారు. మరికొద్ది రోజుల్లో మిర్చి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మరికొందరు రైతులు కోల్డ్‌ స్టోరేజిలలో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకున్నారు.

2296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles