అక్టోబర్ 05 శనివారం 2019.. మీ రాశిఫలాలు

Sat,October 5, 2019 06:26 AM

మేషం

: ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్థలు ఏర్పడే అవకాశముంటుంది. ఆధ్యాత్మిక క్షేతసందర్శన చేస్తారు. ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వివాదాలకు దూరం గా ఉండటం మంచిది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

వృషభం

: ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతు లు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు.

మిథునం

: మిథునం: ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం.

కర్కాటకం

: ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడు తుంది. గృహ సంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లి గారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

సింహం

: ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మాన సికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవ సరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మారు్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవదర్శనం, ఆధ్యాత్మిక క్షేతాల్ని సందర్శిస్తారు.

కన్య

: ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామా న్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

తుల

: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉం టారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

వృశ్చికం

: ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయ టానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశ ముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువు ల తో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయా ణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు

: ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవ టానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు.

మకరం

:బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణ యాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.

కుంభం

:మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుం టుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

మీనం

: మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార లావా దేవీల్లో అనుకున్న ప్రగతి సాధిస్తారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

5492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles