పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 50శాతం రిజ‌ర్వేష‌న్‌...

Sun,December 16, 2018 05:36 PM

50 percent reservation in panchayat elections in telangana state

హైద‌రాబాద్‌: ప‌ంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 50శాతం రిజ‌ర్వేష‌న్ ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ‌లు, వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌నుంది. దీనికోసం రాష్ట్ర‌ప్ర‌భుత్వం పంచాయ‌తీరాజ్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

రిజర్వేషన్ల ఖరారు ఇలా..

రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా తొలుత రాష్ట్రస్థాయి కోటాను ఖరారుచేస్తారు. ఆ తర్వాత జిల్లాలవారీ రిజర్వేషన్ల కోటాను త్వరలోనే విడుదల చేయనున్నారు. పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాల ప్రకారం.. 100 శాతం ఎస్టీలున్న 1,326 గ్రామాలతోపాటు మరో 1,308 గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించనున్నారు. 2,634 ఈ గ్రామాలను మినహాయిస్తే రాష్ట్రంలో ఇక 10,117 మైదానప్రాంత పంచాయతీలుంటాయి. వీటిలో జనాభా ఆధారంగా ఎస్టీలకు 5.73 శాతం (580 పంచాయతీలు), ఎస్సీలకు 20.46 శాతం (2,070 పంచాయతీలు) రిజర్వుచేశారు. వీటిని మినహాయించి పాత చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం (3,440 పంచాయతీలు), జనరల్ క్యాటగిరీలో 4,027 పంచాయతీలు ఖరారుచేస్తారు.

50 శాతం మహిళలకు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించనున్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పంచాయతీలు, వార్డుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తారు. గ్రామాల్లో రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన మార్గదర్శకాల్లో వివరించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 10 వార్డులున్న పంచాయతీలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ఆధారంగా వార్డు స్థానాలను ఖరారుచేయనున్నారు. ఉదాహరణకు 2,900 మంది జనాభా ఉన్న గ్రామంలో ఎంత శాతం ఎస్టీ జనాభా ఉంటే అంత శాతం వార్డులను వారికి కేటాయిస్తారు.

5332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles