ఆడుకుంటూ మృత్యు ఒడిలోకి...

Sun,April 29, 2018 08:49 PM

5 year old girl died of current shock in mancheryal dist

మంచిర్యాల: కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకటి సీతామహాలక్ష్మీ(5) అనే చిన్నారి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్‌ఐ తాళ్ల శ్రీకాంత్ తెలిపారు. దేవాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్ కథనం మేరకు... వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకటి భీమ్‌రావు-రుకుం భాయిల కూతురు సీతామహాలక్ష్మీ(5) 1వ తరగతి చదువుతుంది. శనివారం వెంకటాపూర్ గ్రామంలోని తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఇంటి పక్కన ఉండే పుష్నాక భీమ్‌రావు అనే వ్యక్తి తన ఇంటి చుట్టూ పంది కొక్కులను హత మార్చేందు కోసం తన ఇంటి చుట్టూ వెదురుతో ఏర్పాటు చేసిన పహారీకి బైండింగ్ వైర్లను అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి కరెంట్ సరఫరా ఏర్పాటు చేశాడు.

ప్రతి రోజు ఇదే విధంగా విద్యుత్ సరఫరా చేస్తూ తొలిగిస్తూ ఉంటుండగా శనివారం మాత్రం కరెంట్ సరఫరాను ఉంచి తొలగించకుండా ఉంచాడు. శనివారం చిన్నారి సీతామహాలక్ష్మీ ఆడుకుంటూ విద్యుత్ ఏర్పాటు చేసిన స్థలం వద్దకు వెళ్లి వెదురుతో కూడిన పహారీ వద్దకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలియని కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదని ఎంత వెతికినా చిన్నారి ఆచూకి లభ్యం కాలేదు. రాత్రి సమయానికి ఇంటి పరిసరాల్లో వెతుకుతూ ఉండగా వెదురుతో కూడిన పహారీ వద్ద చూడగా విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు గుర్తించారు. కూతురు మృతితో కుటుంబ సభ్యుల రోధనలు అందరినీ కలిచి వేశాయి. మందమర్రి సీఐ రాంచందర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. విద్యుత్ శాఖ ఏఈ రామ్మూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

4240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles