ఐసెట్‌కు 49,465 మంది దరఖాస్తు.. ఈ నెల 23, 24 తేదీల్లో పరీక్షలు

Mon,May 20, 2019 08:03 PM

49465 candidates applied for icet

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించే టీఎస్ ఐసెట్-19 పరీక్షలకు 49,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య సీహెచ్ రాజేశం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 54 సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, విజయవాడ, విశాఖపట్టం, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

అక్కడి కేంద్రాల్లో 1954 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో 64 మంది పరిశీలకులను నియమించామని, హైదరాబాద్‌లోనే అత్యధికంగా పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. 2905 మంది అభ్యర్థులు ఉర్ధూలో పరీక్ష రాయనున్నట్లు, 24 మంది దివ్యాంగులు పరీక్షకు నమోదు చేసుకున్నట్లు వివరించారు.

దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌తో ముందు రోజు పరీక్షా కేంద్రంలో సంప్రదించాలని, అంధులకు స్ర్కైబ్ అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఆధార్‌కార్డు, ఫొటోతో డిక్లరేషన్ ఇవ్వాలని బయోమెట్రిక్ అటెండెంట్స్ ఉంటుందన్నారు. ఒక నిమిషం నిబంధన అమలులో ఉందని రాజేశం పేర్కొన్నారు. 23న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 24వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా హాల్‌కు అభ్యర్థులు గంట ముందుగా హాజరుకావాలని, హాల్‌టికెట్‌లోని సూచనలను పాటించాలని ఆయన సూచించారు.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles