47 గొర్రెలు మృతి.. యజమానికి మంత్రి పరామర్శ

Wed,June 6, 2018 03:27 PM

47 sheeps dies in Balanagar mandal

మహబూబ్ నగర్ : బాలానగర్ మండలం మోతీఘనపూర్ లో మంగళవారం రాత్రి టైర్ల కంపెనీ గోడ కూలి 47 గొర్రెలు మృతి చెందాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం గొర్రెల యజమాని గొల్ల చంద్రయ్యను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా చంద్రయ్యను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జ‌రిగిన న‌ష్టం విలువ‌ను తెలుసుకున్న మంత్రి.. చంద్ర‌య్య‌ను ఓదార్చారు. చంద్ర‌య్య‌కు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం అందించేంద‌కు కృషి చేస్తామ‌న్నారు. మంత్రి వెంట స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఉన్నారు.

1186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles