తెలంగాణలో 465 సంక్షేమ కార్యక్రమాలు : సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 07:13 PM

465 welfare schemes implement in Telangana says CM KCR

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 465 సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డలే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుపోతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ వచ్చాన ఆరు నెలల దాకా అధికారులు లేని పరిస్థితి. ఆ తర్వాత అధికారులు రావడంతో.. అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను బాగు చేశాం. చిమ్మ చీకట్లో నుంచి జిలుగు వెలుగుల్లోకి వచ్చాం. ఇక నుంచి రెప్పపాటు కూడా కరెంట్ పోదు. ఉమ్మడి పాలనలో జరిగిన తెలంగాణ జీవన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. కులవృత్తులు ఎంత ధ్వంసమయ్యాయే తలుచుకుంటే దుఃఖం వచ్చిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి వీధి వీధి తిరిగి జోలె పట్టుకున్నాను అని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్.. సబ్సిడీ మీద చేనేత రుణాలు ఇచ్చామని చెప్పారు. గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. గొర్రెల పంపిణీతో గొల్లకుర్మల జీవితాలు బాగుపడ్డాయి. పాడి రైతులకు సబ్సిడీ మీద బర్రెలను పంపిణీ చేశాం. రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే కాకుండా అదనంగా 76 అంశాలను అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ బాధలు శాశ్వతంగా పోయే విధంగా అద్భుత ప్రణాళికలు చేశామని కేసీఆర్ తెలిపారు.

4201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles