42 అడుగుల భారీ బతుకమ్మను చూశారా?

Wed,October 17, 2018 10:45 PM

42 feet heavy bathukamma in khammam dist

ఖమ్మం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. బుధవారం సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని జిల్లాలోని కూసుమంచి మండలం పెరికసింగారంలో 42 అడుగుల భారీ బతుకమ్మను తయారుచేశారు. సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్‌రావు, ఎంపీటీసీ విజయలక్ష్మీ దంపతులు ఐదు రోజుల పాటు శ్రమించి మూడు ట్రక్కుల టేకు పూలు, రెండు ట్రక్కుల తంగెడు పూలు, మూడు క్వింటాళ్ల బంతిపూలు, అనేక రకాలైన పూలను ఐదు రోజులుగా సమకూర్చి రంగులు అద్ది భారీ బతుకమ్మను తయారు చేసి ట్రాక్టర్ ట్రక్కుపై ఏర్పాటు చేశారు. 70 మందితో కలిసి 42 అడుగుల భారీ బతుకమ్మను తయారు చేశారు. అనంతరం మేళతాళాలతో బతుకమ్మ పాటలు, డీజేలతో ఊరేగింపు నిర్వహించారు. ఆడిపాడి సాగర్ కాలువలో నిమజ్జనం చేశారు.

2931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles