మహిళ కడుపులో నుంచి 4 కేజీల కణితి తొలగింపు

Wed,May 22, 2019 11:15 PM

4 kg tumor removed from woman stomach in gadwal

గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జయప్రజా వైద్యశాలలో డాక్టర్ మోహన్‌రావు అరుదైన ఆపరేషన్ చేసి ఓ మహిళా కడుపులోని గర్భసంచి నుంచి 4 కేజీల కణితిని తొలగించారు. డాక్టర్ మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సుంకులమ్మమెట్‌కు చెందిన లక్ష్మీ 2017 సంవత్సరంలో కడుపులో నొప్పి వస్తుందని తమ దగ్గరకు వచ్చిందని.. ఆమెను పరిశీలించగా కడుపులో 13 సెంటీమీటర్ల కణితి ఉందని చెప్పామన్నారు.

అయితే అప్పుడు ఆమె ఆపరేషన్‌కు నిరాకరించిందని తెలిపారు. ప్రస్తుతం కడుపులోని ఆ కణితి పెరిగి పెద్దదయిందని.. దీంతో ఆ మహిళ ఇబ్బంది పడుతుండటంతో తమ దవాఖానలో చేరిందని చెప్పారు. రెండు గంటలు కష్టపడి ఆపరేషన్ చేయగా లక్ష్మీ కడుపులోని నాలుగు కిలోల కణితిని బయటకు తీశామని తెలిపారు. మహిళకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు.

651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles