ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్

Tue,May 14, 2019 06:30 PM

3rd phase parishad polling ends in telangana


హైదరాబాద్ : రాష్ట్రంలో పరిషత్ మూడో విడత ఎన్నికలు పూర్తయ్యాయి. మూడో విడతలో 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది..1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్‌ను సాయంత్రం 4గంటల వరకే అధికారులు పరిమితం చేశారు. పోలింగ్ సమయం ముగిసేలోపే క్యూలైన్లలో నిల్చున్న వాళ్లందరికీ ఓటువేసే అవకాశాన్ని కల్పించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 70.19 శాతం పోలింగ్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 75.58 శాతం పోలింగ్ నమోదవగా..ములుగు జిల్లాలో 72 శాతం పోలింగ్ నమోదైంది.

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు:* జోగులాంబ గద్వాల జిల్లాలో 71.8 శాతం పోలింగ్
* నారాయణ పేట జిల్లాలో 63.89 శాతం పోలింగ్
* ములుగు జిల్లాలో 67 శాతం పోలింగ్
* మెదక్ జిల్లాలో 71.24 శాతం పోలింగ్
* రాజన్న సిరిసిల్లా జిల్లా పోలింగ్ 69.28 శాతం
* నాగర్‌కర్నూల్ జిల్లాలో 8 మండలాల్లో 67 .76 పోలింగ్ శాతం నమోదు.
* ఆసిఫాబాద్‌ జిల్లాలో 68.83 శాతం పోలిoగ్ నమోదైంది.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles