328 ఔషధాలపై ప్రభుత్వం నిషేధం!

Thu,September 13, 2018 07:47 PM

328 medicinal drugs prohibited in telangana

హైదరాబాద్: తలనొప్పితో పాటు ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ‘సారిడాన్’ ఔషధంతో పాటు పలు ప్రముఖ ఔషదాలపై కేంద్రం నిషేధం విధించింది. దీనితో పాటు మరికొన్ని ప్రముఖ ఔషధాలు(డ్రగ్స్) కూడా త్వరలో కనుమరుగు కానున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ 328 ఫిక్స్‌డ్ డోస్ కాబినేషన్స్ (ఎఫ్‌డీసీ) ఔషధాలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 

ఈ నిర్ణయంతో 2016 ప్రభుత్వం, ఔషధ తయారీ సంస్థల మధ్య జరుగుతున్న న్యాయ యుద్ధం ముగిసినట్లయింది. ఈ ఔషధాల వినియోగం ప్రమాదకరమని ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ నిషేధం వల్ల సుమారు 6 వేల ఔషధ బ్రాండ్లపై ప్రభావం పడనుంది. వీటిలో సారిడాన్‌ వంటి పెయిన్ కిల్లర్లతోపాటు స్కిన్ క్రీమ్ పెండర్మ్, మధుమేహం ఔషధం గ్లుకోనార్మ్ పీజీ, యాంటి బయోటిక్ ఔషధం లుపిడిక్లాక్స్, యాంటీ బ్యాక్టిరియల్ ఔషదం ట్యాక్సిమ్ AZ తదితర రకాల కాంబినేషన్ డ్రగ్స్ ఇకపై కనిపించవు. 

ఈ డ్రగ్స్ సేఫ్ 
నిషేధానికి గురవుతాయని భావించిన ప్రముఖ ఔషధాలు డీకోల్డ్ టోటల్, కొరెక్స్ దగ్గు మందు, పెన్సిడైల్ కాఫ్ లింక్టస్‌లకు నిషేధం నుంచి ఉపశమనం లభించడం గమనార్హం. ప్రభుత్వం 2016, మార్చి 10న 344 ఎఫ్‌డీసీలపై నిషేదం విధించింది. ఆ తర్వాత మరో ఐదింటిని నిషేధ జాబితాలో కలిపింది. దీంతో ఔషధ ఉత్పత్తి సంస్థలు వివిధ హైకోర్టులు, సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు డిసెంబరు 15, 2017న డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) ద్వారా పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీటీఏబీ మొత్తం 328 ఎఫ్‌డీసీలు ప్రమాదకరమైనవిగా గుర్తించి, వాటిని నిషేధించాలని సూచించింది. ఈ నిషేధం వల్ల ప్రముఖ దగ్గు, పెయిన్ కిల్లర్, జలుపు వంటి ఔషధాలపై ఏటా లభించే రూ.740 కోట్లు రాబడికి గండిపడనుంది.

9103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles