30 పురాతన నాణేలు లభ్యం

Mon,July 15, 2019 09:47 PM

30 antique coins found in jogulamba gadwal

గద్వాల : జోగుళాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామంలో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెంకన్న తన ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాడు. అయితే నిర్మాణ పనులు చేపడుతుండగా మట్టి తవ్వకంలో ఓ చిన్నపాటి మట్టికుండలో పురాతన కాలం నాటి బంగారు, వెండి నాణేలు కొన్ని బయటపడ్డాయి. ఈ విషయాన్ని బయటికి పొక్కడంతో తాసిల్దార్ జ్యోతి, గద్వాలరూరల్ ఎస్సై నాగశేఖర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి వెంకన్న ఇంటిని తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో వెంకన్నను విచారించారు. అయితే మరుగుదొడ్డి నిర్మాణ పనుల్లో దొరికిన మట్టి కుండలో 11 బంగారు, 19 వెండి నాణేలు మాత్రమే తనకు లభించాయని వెంకన్న అధికారులకు చెప్పారు. దీంతో వెంకన్న నుంచి సుమారు తులం బరువున్న 11 బంగారు నాణేలు, 2 తులాల బరువున్న 19 వెండి నాణేలు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. కాగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న పురాతన నాణేలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పురావస్తు శాఖకు అప్పగించనున్నట్టు తాసిల్దార్ జ్యోతి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గద్వాల రూరల్ ఎస్సై నాగశేఖర్‌రెడ్డి తెలిపారు.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles