రెండో వివాహం చేసుకుని..

Fri,May 24, 2019 07:27 AM

3 years imprisonment to a man in dowry harassments case


హైదరాబాద్ : రెండో వివాహం చేసుకుని, అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యవహారంలో ఇద్దరికి ఎల్బీనగర్‌ కోర్టు 3 ఏండ్ల జైలు శిక్షను గురువారం విధించింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హెచ్‌బీ కాలనీ, కైలాస్‌గిరి ప్రాంతానికి చెందిన అంజయ్యకు 16 సంవత్సరాల కిందట పద్మతో వివాహం జరిగింది. అయితే అంజయ్య తరచుగా అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. అంతేకాకుండా పద్మకు తెలియకుండా నర్సుగా పని చేస్తున్న ఆదిలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి పద్మ భర్త అంజయ్య, ఆదిలక్ష్మీలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలు కోర్టు ముందు పెట్టగా న్యాయమూర్తి అంజయ్య, ఆదిలక్ష్మీలకు మూడేండ్ల జైలు శిక్ష, జరిమానాను విధించింది.

4900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles