పటాన్‌చెరు పీఎస్ పరిధిలో ముగ్గురు అదృశ్యం

Wed,June 12, 2019 03:17 PM

3 womens missing in Sangareddy dist

సంగారెడ్డి : పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థినులు, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమయ్యారు. పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమయ్యారు. నిన్న కళాశాలకు వెళ్లిన విద్యార్థినులు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థినుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమైంది. నిన్న రాత్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శివాని స్నేహితుడు కాలనీలో దింపినట్లు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైంది. నిన్న రాత్రి నుంచి శివాని కనిపించుకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

1484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles