తిరుమలలో మరో కిడ్నాప్ ఘటన కలకలం

Sun,March 17, 2019 03:54 PM

3 months old baby Kidnapped in Tirumala


తిరుమల: తిరుమలలో 3 నెలల క్రితం చిన్నారి అపహరణ ఘటన మరువకముందే మరో కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు 3 నెలల పసికందును తల్లి ఒడి నుంచి ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం 5.30 నిమిషాలకు తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో తమ కుమారుడిని ఎత్తుకెల్లారంటూ చిన్నారి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అపహరణకు గురైన 3 నెలల బాలుని పేరు వీర అని..బాలుడి తల్లిదండ్రులు మహావీరా, కౌసల్య తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో పసికందును అపహరించినట్లు వీర తండ్రి పోలీసులకు తెలిపాడు. దంపతులిద్దరూ తమిళనాడు కు చెందిన వారు కాగా..వారు తిరుమలలో హాకర్స్ గా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆగంతుల కోసం తిరుమలలోని‌ ప్రధాన‌ ప్రా౦తాల్లో సీసీ టీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. మూడు పోలీస్ బృ౦దాలు చిన్నారి కోస౦ తిరుమల బస్టా౦డ్, నడక మార్గ౦ పరిసర ప్రా౦తాల్లో గాలిస్తున్నాయి. త్వరలో చిన్నారి ఆచూకి తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.

2876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles