భద్రాచలం బస్టాండ్‌లో 27 కిలోల గంజాయి పట్టివేత

Fri,December 14, 2018 09:28 PM

27 kilo ganja seized in bhadrachalam bus stand

-ముగ్గురు వ్యక్తులు అరెస్టు
భద్రాచలం: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను భద్రాచలం పోలీసులు పట్టణంలోని బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)జిల్లాకు చెందిన అరుణ్, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సోము యాదవ్, ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్ జిల్లా బల్వాలికి చెందిన చెందిన అంకూర్ యాదవ్ కొన్నాళ్ల నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో వారు ఛత్తీస్‌గఢ్ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారు. శుక్రవారం భద్రాచలం బస్టాండ్‌లో గంజాయి ప్యాకెట్లతో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా స్థానిక పోలీసులు విచారించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.

1298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles