26 మార్చి 2019 మంగళవారం మీ రాశిఫలాలు

Tue,March 26, 2019 05:36 AM

26 march 2019 Tuesday daily horoscope

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే చీటికి మాటికి చిరాకు ఎక్కువవుతుంటుంది. తలపెట్టిన ప్రయాణం ఆగిపోవడం కానీ, వాయిదా పడటం కానీ జరగవచ్చు. అలాగే ఉద్యోగ విషయంలో పై ఆధికారులనుం చి అవమానాలు ఎదురయ్యే అవకాశముంటుంది.


వృషభం

వృషభం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.


మిథునం

మిథునం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.


కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం చేస్తారు.


సింహం

సింహం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురికాకండి. ప్రశాంతంగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.


కన్య

కన్య : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.


తుల

తుల : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.


వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.


ధనుస్సు

ధనుస్సు : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.


మకరం

మకరం: మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు.


కుంభం

కుంభం : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి.


మీనం

మీనం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శతృవులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

10108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles