కొండ‌గ‌ట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా.. 51 మంది మృతి

Tue,September 11, 2018 12:20 PM

24 dead, 20 injured in RTC bus accident in kondagattu

జగిత్యాల: కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 51 మంది మృతి చెందగా.. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరకున్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

60 మంది ప్ర‌యాణికుల‌తో శ‌నివారంపేట నుంచి బ‌స్సు బ‌య‌లుదేరింది. ఘాట్ నుంచి మ‌రో నిమిషంలో ప్ర‌ధాన ర‌హ‌దారిపైకి చేరుకునే స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. స్పీడ్ బ్రేక‌ర్ వ‌ద్ద అదుపు త‌ప్ప‌డంతో ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. ప్ర‌యాణికులంతా డ్రైవ‌ర్ వైపు ఒర‌గ‌డంతో బ‌స్సు బోల్తా ప‌డింది. కొండ‌గ‌ట్టులో ద‌ర్శ‌నం ముగించుకుని జ‌గిత్యాల వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల్లో మ‌హిళ‌లు, ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 80 మందికి పైగా ప్ర‌యాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.


11890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles