HomeLATEST NEWS22 september saturday 2018 horoscopes details

సెప్టెంబర్ 22 శనివారం 2018..మీ రాశి ఫలాలు

Published: Sat,September 22, 2018 05:17 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

మేషం

ఈ రోజు స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉం టాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. చర్చలు సఫలం అవుతాయి.

వృషభం

ఈరోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పండాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

మిథునం

రోజువారి పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు.గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం

ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివుడిని పూజించండి.

సింహం

ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం విషయం లేదా విద్య విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

కన్య

ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.

తుల

మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది.

వృశ్చికం

ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలవైనప్పటికీ బయటకెళ్లడంకంటే ఇంట్లో కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు

ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయటం కాని, మిత్రులను కలవడం కానీ చేస్తారు. అలాగే వాహన కొనుగోలు కానీ, రిపేర్ చేయించటం కానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం

ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు,వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూర బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

కుంభం

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహా రం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

మీనం

కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబ ంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

16405
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology