22 జూన్ 2018 శుక్రవారం.. మీ రాశి ఫలాలు

Fri,June 22, 2018 06:12 AM

22 June Friday 2018 horoscope details

మేషం

మేషం : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువ సమయం గడుపుతారు.

వృషభం

వృషభం : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరగవచ్చు. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. మీ సంతానం కారణంగా కొంత ఆందోళనకు లోనవుతారు.

మిథునం

మిథునం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశముంది కాబట్టి జాగ్రత్త అవసరం.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఇంటికి సంబంధించిన మరమ్మతులు, నిర్మాణ ఆరంభం కానీ చేస్తారు.

సింహం

సింహం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

కన్య

కన్య : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార సంబంధ ఒప్పందాలకు, గృహనిర్మాణ ఆరంభానికి అంతగా అనుకూలమైన రోజు కాదు.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుం ది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు లోనవుతారు. ఏ పనిమీద ఆసక్తి కనపరచరు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. మీ సహోద్యోగుల సాయం అందుకుంటారు. ప్రయాణాలు కలిసి రావు. ఒప్పందాలకు అనుకూల దినం కాదు.

మకరం

మకరం : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉం టుంది. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

కుంభం

కుంభం : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

మీనం

మీనం : ఈ రోజు మీ దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభ కార్యక్రమంలో కానీ పాల్గొంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచుకోవడం చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

8172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles