చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు : సీఎం కేసీఆర్‌

Mon,July 22, 2019 02:33 PM

2 thousand houses will construct in Chintamadaka village says CM KCR

హైదరాబాద్‌ : తన సొంతూరైన చింతమడకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. భవిష్యత్‌లో చింతమడక బంగారు తునక కావాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతామని కేసీఆర్‌ తెలిపారు. చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నానని ఆత్మీయ అనురాగ సభా వేదికపై సీఎం ప్రకటించారు. కార్తీక మాసంలో చింతమడకలో గృహప్రవేశాలు జరగాలి. చింతమడక నన్ను కనిపెంచింది. చింతమడక కోసం నేతు ఎంత చేసినా తక్కువే అని ఆయన అన్నారు. చింతమడక కోసం అదనంగా రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పారు. అదనపు నిధులు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌ పొందవచ్చు అని సూచించారు. ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవాలి. అద్భుతమైన ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలి. సీసీరోడ్లు వేయించుకోవాలి. తాగు, సాగురు త్వరలో రాబోతోంది. చింతమడక ఒక బంగారు తునక కావాలి. ఈ గ్రామాన్ని చూసి పక్క ఊర్లు నేర్చుకోవాలి. అలాంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతది. చింతమడకలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలి అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

1211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles