ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు

Thu,September 19, 2019 09:48 PM

ఇద్దరికి తీవ్రగాయాలు.. మాల్ బస్టాండ్‌లో ఘటన


నల్లగొండ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకురావడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండల పరిధిలోని తేనేపల్లితండాకు చెందిన రమావత్ లక్ష్మి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాలోని తన కూతూరి ఇంటికి వెళ్లేందుకు ఉదయం మాల్ బస్టాండ్‌కు వచ్చింది. అదే సమయంలో ఆమె సమీప బంధువైన మాడ్గుల మండలం నర్సాయిపల్లి పంచాయతీ పరిధిలోని చౌటకొండతండాకు చెందిన నేనావత్ చంద్రునాయక్ అక్కడ కనిపించడంతో ఇద్దరు మాట్లాడుతూ ప్లాట్‌ఫాంపై కూర్చున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్05 జడ్ 0199) అదుపుతప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకురావడంతో లక్ష్మి, చంద్రునాయక్‌ల కాళ్లు ఛిద్రమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్సనిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. వీరిలో లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ నందులాల్‌నాయక్ తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

4490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles