ట్రక్కును ఢీకొన్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు

Mon,November 11, 2019 07:50 AM

రంగారెడ్డి : శంషాబాద్‌కు సమీపంలోని పెద్దషాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కును ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు మృతి చెందారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నంద్యాల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles