గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2,39,749

Sat,September 14, 2019 10:26 AM

2 LAKHS 39 THOUSAND STUDENTS IN TELANGANA RESIDENTIAL SCHOOLS

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొత్తం 602 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శాసనసభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నపై మంత్రి సమాధానం ఇచ్చారు. 602 గురుకుల పాఠశాలల్లో 2,39,749 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. 11,785 మంది సిబ్బందిని నియమించామని స్పష్టం చేశారు. గురుకులాలకు రూ. 2,243 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలల వ్యవస్థను నెలకొల్పడమే కాకుండా.. ప్రయివేటు విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే కాకుండా, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. గొప్పగా నిర్వహిస్తున్న గురుకులాలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రవేశాల కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఐదో తరగతిలో ప్రవేశాల కోసం లక్షా 35వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశాల కోసం అర్హత పరీక్ష నిర్వహించి.. సీట్లు కేటాయిస్తున్నారు. పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం కూడా మెరుగ్గా ఉందన్నారు. విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటూనే.. సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles