సూర్యాపేటలో 2 కిలోల గంజాయి పట్టివేత

Wed,May 1, 2019 08:15 PM

2 kg ganja seized in suryapet

యువకుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
అరకు నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడి

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వెంకన్నబావి బజార్‌లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంకన్నబావి బజార్‌లో ఒక యువకుడు గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారంతో ఆ కాలనీలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

కస్తూరి బజార్‌కు చెందిన కానుకుర్తి సాయినవీన్(22) అనుమానాస్పదంగా సంచరించడంతో తనిఖీ చేయగా అతని వద్ద రెండు కిలోల గంజాయి పట్టుబడింది. అతడిని తహసీల్దార్ సమక్షంలో హాజరు పరిచి గంజాయికి పంచనామా చేసి స్వాధీన పర్చుకున్నారు. నిందితుడిని విచారించగా నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ లోని అరకు నుంచి ఒక కిలో రూ.3 వేల చొప్పున కొనుక్కొని వస్తున్నట్లు అంగీకరించాడు. పట్టణంలో విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని రూ.500 లకు 100 గ్రాముల చొప్పున అమ్ముతున్నట్లు తెలిపాడు.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles