తరచూ గొడవలు..నిందితుడికి 2 రోజుల జైలు శిక్ష

Wed,June 12, 2019 09:19 AM

2 days jail term to accused who involves in clashes


హైదరాబాద్ : స్థానికంగా తరచూ ఘర్షణలకు పాల్పడుతున్న వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి సీఐ వెంకట్‌ రెడ్డి కథనం ప్రకారం... ఆజామాబాద్‌ నాగమయ్యకుంటకు చెందిన లింగంపల్లి సుమన్‌ (34) రోజూ మద్యం తాగి స్థానికంగా గొడవలకు పాల్పడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా సుమన్‌ స్థానికంగా ఘర్షణకు దిగగా..స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వెళ్లి సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా, అతనికి రెండు రోజలు జైలు శిక్షతో పాటు రూ.50ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు.

1555
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles