హత్య కేసులో పురోగతి..ఇద్దరు నిందితులు అరెస్ట్

Fri,May 10, 2019 07:58 AM

2 arrested in Chandrayan gutta Murder case


హైదరాబాద్ : పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి కత్తి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ వివరాలను వెల్లడించారు..అక్టోబర్‌ , 2018లో ముకుందర్‌ హోటల్‌ వద్ద మహ్మద్‌ హాజీ (27), అబ్దుల్‌ జబ్బర్‌ (25), ఇతని తమ్ముడు రఫీ ముగ్గురు కలిసి టీ తాగుతుండగా చౌవుస్‌, అబ్దుల్‌ఖాదర్‌ జిలానీ వచ్చారు. వారిని తమ వద్దకు రమ్మని అబ్దుల్‌ జబ్బర్‌ పిలిచాడు. మీరు పిలిస్తే మేం రావాలా అంటూ చౌవుస్‌, అబ్దుల్‌ఖాదర్‌ జిలానీ ప్రశ్నించారు. దీంతో వీరి మధ్య వాగ్వాదం నెలకొంది.

గొడవ జరుగుతుండగా అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ తలపై కొట్టారు. ఈ ఘటనలో అప్పట్లో మహ్మద్‌ హాజీ, అబ్దుల్‌ జబ్బర్‌లను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమపై కేసు పెట్టడానికి కాలా ఇమ్రాన్‌ కారణమని తెలుసుకున్న మహ్మద్‌ హజీ, అబ్దుల్‌ జబ్బర్‌లు అతనిపై కక్ష్య పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల 27న ఫాతిమానగర్‌లో కాలా ఇమ్రాన్‌..స్నేహితుడి కూతురు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఇమ్రాన్‌పై హాజీ,అబ్దుల్‌ జబ్బర్‌లు కత్తితో దాడి చేయగా మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వర్‌రావు దర్యాప్తు చేస్తున్నారు.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles