19 సెప్టెంబర్‌ గురువారం 2019.. మీ రాశిఫలాలు

Thu,September 19, 2019 06:31 AM

మేషం

మేషం :ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువులు, నగల విషయంలో జాగ్రత్త అవసరం. మీ అజాగ్రత్త కారణంగా వాటిని కోల్పోయే అవకాశముంటుంది.

వృషభం

వృషభం : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. గృహసంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం

మిథునం :ఈ రోజు ఉద్యోగంలోకానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కానీ, నివాస స్థలంలో కానీ మార్పు ఉంటుంది. పెట్టుబడులుపెట్టడానికి అనుకూలదినం కాదు. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

కర్కాటకం

కర్కాటకం:ఈ రోజు పాతమిత్రులను కానీ, దూరదేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. మీసంతానం విజయం మీకు ఆనందాన్ని ఇస్తుంది.

సింహం

సింహం:ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. వృత్తిలో మార్పులు ఉంటాయి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సివస్తుంది. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదాపడతాయి. అనవసర ఖర్చుపైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.

కన్య

కన్య :ఈ రోజు స్నేహితులతో, జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారంసేవిస్తారు. వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలుకానీ, భూ సంబంధవ్యవహారాలుకానీ ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రసందర్శనచేస్తారు.

తుల

తుల :ఈరోజు గృహసంబంధ వ్యవహారాల్లో మునిగితేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటంకానీ, వాహనంకొనుగోలు చేయటంకానీచేస్తారు. ఆరోగ్యవిషయంలోజాగ్రత్తఅవసరం. అత్యుత్సాహానికిపొకండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం

వృశ్చికం :మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడాసమయానికి మాటమార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజుకాదు. పిల్లలతో గడపటంకానీ, వినోదకార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది.

ధనుస్సు

ధనుస్సు :ఆరోగ్యవిషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పికానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీకుటుంబసభ్యులలో ఒకరిఆరోగ్యం కూడా మీకు ఆందోళనకలిగించే అవకాశం ఉన్నది.

మకరం

మకరం :మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తనకారణంగా మీబంధువులను అసహనానికి గురిచేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి ప్రయాణాల్లోజాగ్రత్త అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కుంభం

కుంభం :ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీమాట తీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగాఉండటంమంచిది. దానివలన మీప్రతిష్టకు భంగం కలగకుండాఉంటుంది.

మీనం

మీనం :స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవితభాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles