19 అక్టోబర్ గురువారం 2017..మీ రాశీ ఫలాలు



Thu,October 19, 2017 06:34 AM
19 అక్టోబర్ గురువారం 2017..మీ రాశీ ఫలాలు

మేషం

మేషం : ఉద్యోగం లేదా ప్రయాణం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

వృషభం

వృషభం : అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వల్ల మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

మిథునం

మిథునం :ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. బంధువుల నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

సింహం

సింహం : ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

కన్య

కన్య : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

తుల

తుల : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభ పరిణామాలుంటాయి.

ధనుస్సు

ధనుస్సు :వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ పయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న పయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మకరం

మకరం : రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం, కొత్త వ్యక్తులను కలుసుకోవటం జరుగుతుంది. మానసికంగా తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు.

కుంభం

కుంభం : చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం కాదు.

మీనం

మీనం : మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవటానికి అనుకూల దినం. జీవిత భాగస్వామితో ఉన్న అపోహలు తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. నివాస స్థలంలో మార్పు ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది.

7236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS