19 ఫిబ్రవరి 2019 మంగళవారం మీ రాశిఫలాలు

Tue,February 19, 2019 06:36 AM

19th February 2019 Tuesday horoscopes

మేషం

మేషం : ఈ రోజు ఇంటిపట్టున ఉండి చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు లేదా భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృషభం

వృషభం : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పుకానీ, ట్రాన్స్‌ఫర్ కానీ ఉంటుంది.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు. కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

సింహం

సింహం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

కన్య

కన్య : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనాదా యం ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కాని పను లు ఈ రోజు ఏ ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. గృహసంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల

తుల : ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మితృలతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనవకుండా స్థిమితంగా ఉండటం మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూమైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

మకరం

మకరం : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావటం కానీ, లోన్ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

మీనం

మీనం : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

10113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles