18 అక్టోబర్ గురువారం 2018 మీ రాశీఫలాలు

Thu,October 18, 2018 06:33 AM

18 october 2018 THURSDAY horoscopes details

మేషం

మేషం : ఈ రోజు వ్యాపార లావాదేవీల్లో, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న మీ ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం కారణంగా ఆనందం పొందుతారు. కాంపిటీటివ్ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గృహసంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.

మిథునం

మిథునం : ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానికి గురవడం లేదా వివాదాల్లో ఇరుక్కోవడంజరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

సింహం

సింహం : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.

కన్య

కన్య : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడం వల్ల మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

మకరం

మకరం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

కుంభం

కుంభం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ, ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

10282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS