ప్రభుత్వ దవాఖానలో 15 గంటల్లో 18 ప్రసవాలు

Tue,October 23, 2018 08:37 PM

18 Babies Delivered in 15 Hours Sets Hospital Record

శక్కర్‌నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవాఖానలో సోమవారం రాత్రి 12గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 18 మందికి ప్రసవాలు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ అన్నపూర్ణ వెల్లడించారు. 15గంటల వ్యవధిలో 18 ప్రసవాలు చేయగా, అందులో 14 శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 4 సాధారణ ప్రసవాలు జరిపారు.

బోధన్ ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత నెలలో 271 ప్రసవాలు చేశారు. ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ దవాఖానలో మౌలిక వసతులు మెరుగుపడడంతో పాటు ప్రభుత్వం కేసీఆర్ కిట్ అమలు చేయడంతో ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ దవాఖానలో వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, అందుకే రికార్డు స్థాయి ప్రసవాలు జరుగుతున్నట్లు సూపరింటెండెంట్ అన్నపూర్ణ వెల్లడించారు.

1859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS