పిప్పర్‌వాడ టోల్‌ ప్లాజా వద్ద రూ.18.44 లక్షలు పట్టివేత

Thu,November 1, 2018 10:42 PM

18.44 lakh rupees seized at pipparwada toll plaza in adilabad

ఆదిలాబాద్: జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎంహెచ్35పీ 3123 నంబర్‌గల వాహనంలో తరలిస్తున్న రూ.18,44,500 నగదును పట్టుకున్నట్లు తనిఖీ అధికారులు డీటీ అశోక్, ఏఎస్సై నజీబ్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు మహీంద్ర కారులో మహదేవ్ బోసాయి అనే వ్యక్తి ట్రావెలింగ్ బ్యాగులో ఈ డబ్బులను తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

తన సొంత వాహనంలోనే మెడికల్ షాపునకు సంబంధించిన డబ్బులని వివరించగా.. తన వద్ద ఎలాంటి బ్యాంక్ ఓచర్లు కానీ, ఇతర ఆధారాలు లేని కారణంగానే ఆ డబ్బును పట్టుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆ డబ్బులను సీజ్ చేసి ట్రెజరీ కార్యాలయంలో నగదును జమ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు జైనథ్ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు కానిస్టేబుళ్లు పరమేశ్వర్, మురళి, తానోబా, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.

1347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles