16 డిసెంబర్ 2018 ఆదివారం మీ రాశి ఫలాలు

Sun,December 16, 2018 06:07 AM

16th December 2018 Sunday horoscopes details

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం మంచిది.

వృషభం

వృషభం :ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకోవడం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. మీరు గతంలో పోగొట్టుకున్న వస్తువులు దొరకడం కానీ, రాదనుకున్న డబ్బు తరిగి రావడం కానీ జరుగుతుంది.

మిథునం

మిథునం :ఈ రోజు అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం. కోర్టు, ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

కర్కాటకం

కర్కాటకం :ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మీ వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అపార్థాలకు, అపోహలకు తావివ్వకండి

సింహం

సింహం :ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్యంగా వ్యవహరించటం మంచిది. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురయ్యే అవకాశమున్నది. వారితో వాదనకు దిగకండి. మాట విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో అనుకోని నష్టం కానీ, మోసం కానీ జరిగే అవకాశమున్నది.

కన్య

కన్య :మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశమున్నది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. జీవిత భాగస్వామికి వృత్తిలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

తుల

తుల : మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనుస్సు

ధనుస్సు : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం

మకరం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

కుంభం

కుంభం : మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.

మీనం

మీనం : అదృష్టం కలిసివచ్చు రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు.

10370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles