కన్నుల పండువగా సామూహిక వివాహాలు

Sun,August 19, 2018 10:51 PM

16 couples married at a time in korutla temple

- తరలి వచ్చిన బంధువులు
- శాస్ర్తోక్తంగా ఒక్కటైన 16 జంటలు
- వధూవరులను ఆశీర్వదించిన పురప్రముఖులు
జగిత్యాల: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 16 వివాహలను ఏకకాలంలో బ్రహ్మముహూర్తానికి భాజ, భజంత్రీలు, వేదమంత్రాల మధ్య బంధు మిత్రుల సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆరుదైన ఘట్టానికి కోరుట్ల పట్టణంలోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ భూదేవి, శ్రీదేవి సమేత అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణం వేదికగా నిలిచింది. కుల, మతాలకు ఆతీతంగా ప్రాంతీయ విబేధాలను మరిచి ఒక్క చోట చేరిని వివిధ పట్టణాలు, గ్రామాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలకు అన్ని తానై స్వంత ఖర్చులతో వివాహలు జరిపించిన ప్రసాద్ సెలక్షన్ అధినేత బాలే నర్సయ్యకు ప్రశంసలు దక్కాయి.

పెళ్లీలు చేసుకున్న వధువరులకు పెండ్లి బట్టలు, మంగళసూత్రాలు, మట్టెలు, పెళ్లి సామగ్రి తాంభోళం, బిందె, చెంబు, మంగళహారతి సెట్టు ఉచితంగా అందజేశారు. అలాగే ఇరువైపులా వివాహనికి హజరైన బంధు, మిత్రులకు భోజన వసతి కల్పించారు. వేడుకకు పట్టణానికి చెందిన పురప్రముఖులు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

1457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles