అక్టోబర్ 15 మంగళవారం 2019.. మీ రాశిఫలాలు

Tue,October 15, 2019 06:43 AM

మేషం

ఈరోజు అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. అనుకోని ఆనందకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకుంటాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

వృషభం

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వారు ముఖ్యంగా కం టికి, పంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉం టుంది. మానసికంగా ఏదో తెలియని ఆందోళనకి, బాధకి గురవుతారు. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండటానికి గణేశ ఆరాధన కానీ, శివారాధన కానీ చేయటం మంచిది.

మిథునం

ఈ రోజా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను ఉత్సాహంతో, ఏకాగ్రతతో పూర్తి చేస్తారు. రోజులో ఎక్కువ సమ యం మీకు ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందుతారు.

కర్కాటకం

అనుకున్న పనులు అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.

సింహం

ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణం గా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.

కన్య

మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. వారితో గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవటం వల్ల అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.

తుల

మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

వృశ్చికం

ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది.

ధనుస్సు

ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

మకరం

ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబసభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

కుంభం

ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

మీనం

ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది.

4021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles