కాంగ్రెస్ ప్రచారానికి వస్తే రూ.150

Sat,November 17, 2018 09:46 PM

150 rupees for people who come to congress campaign in mahabubabad

మహబూబాబాద్: కురవి మండలంలో డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ చింతపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. ప్రచారానికి వస్తే డబ్బులు ఇస్తామని రమ్మన్నట్లు, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని మహిళలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన జనాలకు డబ్బులు ఇస్తున్న ఘటనలు అక్కడక్కడ కనిపించాయి.

మగవారికి రూ.150 చొప్పున, మహిళలకు రూ.100 చొప్పున పంచుతూ కాంగ్రెస్ నాయకులు హల్‌చల్ సృష్టిస్తున్నారు. కురవి మండలంలోని సూధనపల్లి శివారు జాటోత్ తండాలో జాటోత్ వీరన్న అనే నాయకుడు కాంగ్రెస్ ప్రచారానికి వచ్చిన గిరిజనులకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు. మా ప్రచారానికి వచ్చేవారు అంతా సహృదయంతో వచ్చిన వారు అని చెప్పుకునే కాంగ్రెస్ వారు ఈ సంఘటనలకు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

4146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles