కేటీఆర్ బర్త్ డే సందర్భంగా 15 వేల మొక్కలు నాటే కార్యక్రమం

Tue,July 24, 2018 04:07 PM

15 thousand planting program conducted on KTR Birthday occasion

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 15 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాచుపల్లి, కొంపల్లిలో ఆయన మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి 15 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమం ప్రారంభించారన్నారు. ప్రతీ ఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ..హంగు, ఆర్బాటాలు లేని నాయకుడు, ప్రజలతో మమేకం అయిన నేత కేటీఆర్ అన్నారు. ప్లాస్టిక్ బ్యానర్లు వాడొద్దు, మొక్కలు నాటమని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ సూచన మేరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే వివేకానంద కలిసి రూ.18 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.

864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles