15 నవంబర్ 2017 బుధవారం మీ రాశి ఫలాలు



Wed,November 15, 2017 12:30 AM
15 నవంబర్ 2017 బుధవారం మీ రాశి ఫలాలు

మేషం

మేషం : ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తా రు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. లోన్ కొరకు లేదా ఆర్థిక సాయం కొరకు ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం ఉంటుంది.

వృషభం

వృషభం : మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి ఫలితం ఉంటుంది. పిల్లల ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సం తానం ఎదురుచూస్తున్నవారికి ఫలితం దక్కుతుంది.

మిథునం

మిథునం : పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన ఉంటుంది. విద్యా , భూ, గృహ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు

కర్కాటకం

కర్కాటకం : వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాసం ఉంది. విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది.

సింహం

సింహం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు.

కన్య

కన్య :మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన దుస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహా యం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

తుల

తుల : కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు

ధనుస్సు : మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పను లు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అనవసర ఖర్చులుంటాయి.

మకరం

మకరం : రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయా ణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా అలజడిని కలిగి ఉంటారు.

కుంభం

కుంభం : మానసికంగా అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం

మీనం : మీ ప్రేమను వ్యక్త పరచటానికి, సంబంధాలు మెరుగు పరుచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు, ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు సామాన్యదినం. తొందరపాటు మంచిది కాదు.

5582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS