పదో తరగతి పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ ...

Sat,March 16, 2019 07:39 AM

144 sections at tenth class examination centers

హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా సమాయానికి విద్యార్థులు అరగంట ముందు నుంచే (ఉదయం 9గం టలకే) పరీక్ష హాలులోకి అనుమతించనున్నాం. పరీక్ష ప్రారంభమై 5 నిమిషాల తర్వాత (ఉదయం 9-35కు) విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించడం జరగదు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతరులెవ్వరైనా పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండకూడదన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల పోలీస్ బందోబస్తుతో పాటు తాగునీరు, ప్రాథమిక చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఏర్పాటు చేసిన్నట్లు అధికారులు తెలిపారు.

వెబ్‌సైట్ హాల్‌టికెట్లకు అనుమతి


విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి పొందిన హాల్‌టికెట్లను పరీక్షను అనుమతిస్తామని డీఈఓ తెలిపారు. హాల్‌టికెట్ అందకపోయినా.. ఎవరైనా హాల్‌టికెట్ ఇవ్వడానికి నిరాకరించినా. వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చని జిల్లా విద్యాధికారిణి ఇరుకుల విజయకుమారి తెలిపారు. విద్యార్థులు WW W. bsete langana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ హాల్‌టికెట్లను చీఫ్ సూపరిండెంట్‌లు, ఇన్విజిలెటర్లు అనుమతించాలని, అయితే విద్యార్థుల వివరాలను, ఫొటో అటెండెన్స్ షీట్లలో ఉన్న వివరాలతో సరిపొల్చుకోవాల్సి ఉంటుందని డీఈవో తెలిపారు.

1956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles