అక్టోబర్ 13 ఆదివారం 2019.. మీ రాశిఫలాలు

Sun,October 13, 2019 06:12 AM

మేషం

మేష రాశి : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృషభం

వృషభం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. అపోహలు తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా కలవాలనుకుంటున్న వ్యక్తులను కలుసుకుంటా రు. ఆకస్మిక ధనయోగం ఉంటుంది.

మిథునం

మిథునం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు రోజువారి పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సం ఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారో గ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

కన్య

కన్య : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయం లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

తుల

తుల : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను.. మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. కాంపిటేటీవ్ పరీక్షలు రాస్తున్నవారు విజయం సాధిస్తారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, పరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈ రోజు ఉత్సాహంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మీ బంధువులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. మీ గురించి వచ్చిన పుకార్లు నిజం కాదని గ్రహిస్తారు. అనుకోని ప్రయాణం చేస్తారు. ఆవేశంగా ప్రవర్తించటం మంచిది కాదు. డబ్బు ఎక్కువగా ఖర్చవు తుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు.

కుంభం

కుంభం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాత బాకీలు వసూలైనప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకా శముంటుంది.

మీనం

మీనం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహా రం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహాకారాలు అందుకుంటారు.

4846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles