ఆటోను ఢీకొన్న లారీ 13 మందికి గాయలు

Fri,April 12, 2019 10:35 PM

13 people injured in road accident

గజ్వేల్‌ : ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో 13 మందికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణ సమీపంలోని తూప్రాన్ వైజంక్షన్ వద్ద చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్ నుంచి గజ్వేల్ వైపు వస్తున్న ఆటోను ప్రజ్ఞాపూర్ నుంచి చేగుంట వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరికి తీవ్రగాయలయ్యాయి. ఆటోలో ఉన్న దౌల్తాబాద్‌కు చెందిన వనం రామస్వామి, వనం బాలమణి, వనం నవ్య, నిజామాబాద్‌కు చెందిన కొయిడి సాయిశృతి, కొయిడి పుష్ప, కొయిడి సత్తవ్వ, కామరెడ్డికి చెందిన పెరుమల్ల శ్రావణి, గజ్వేల్ మండలం బంగ్లావెంటకపూర్‌కు చెందిన లక్ష్మి, నెంటూర్‌కు చెందిన ముల్క లక్ష్మి, రంగంపేటకు చెందిన సత్తయ్య, కాళ్లకాళ్‌కు చెందిన భరత్ కుమార్, అజిత్, మహ్మద్ ఫరీద్‌లకు తీవ్ర గాయలైనట్లు సీఐ తెలిపారు. వీరిలో పరిస్థితి విషయంగా ఉన్న వారిని వెంటనే మేరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles