12 జులై 2019 శుక్రవారం మీ రాశిఫలాలు

Fri,July 12, 2019 05:55 AM

12th july 2019 Friday daily free horoscope

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే చీటికి మాటికి చిరాకు ఎక్కువవుతుంటుంది. తలపెట్టిన ప్రయాణం ఆగిపోవటం కానీ, వాయిదా పడటం కానీ జరగవచ్చు. అలాగే ఉద్యోగ విషయంలో పై అధికారుల నుంచి అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

వృషభం

వృషభం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీపిల్లలతో, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీజీవిత భాగస్వామి కోసం లేదా కుటుంబసభ్యులకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్యదినం. చర్చలకు అనుకూల దినం.

మిథునం

మిథునం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారితరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీగృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టుకేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.

సింహం

సింహం : ఈ రోజు పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూసంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతతో ఉంటే పనులు చేయగలుగుతారు.

కన్య

కన్య : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు.

తుల

తుల : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పనిచేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్యవచ్చే అవకాశముంటుంది. దూరప్రయాణాల విషయంలో అనుకూలం. పెట్టుబడులకు అనుకూలం దినం కాదు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధనుస్సు

ధనుస్సు : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకొనేనిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకొనే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందిపడే అవకాశముంటుంది.

మకరం

మకరం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు.

కుంభం

కుంభం : మీరు ఏదైనా కొత్తపని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజుచాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసేపనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలిగిపోతాయి.

మీనం

మీనం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శతృవుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

8391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles