12 ఫిబ్రవరి 2019 మంగళవారం మీ రాశి ఫలాలు

Tue,February 12, 2019 06:34 AM

మేషం

ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృషభం

ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ, ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మిథునం

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

కర్కాటకం

ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం

ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

కన్య

ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

తుల

ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. బంధువులను కలుసుకోవటం కాని, చిరకాల మిత్రులను కలుసుకోవటం కానీ చేస్తారు. ప్రేమ లేదా పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వస్ర్తాలను కానీ, వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

ఈ రోజు ఇంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య, మాట పట్టింపు వచ్చే అవకాశముంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన, అనవసర ఆవేశం ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు

ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. మిత్రులకు, బంధువులకు సాయం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఖర్చు ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వినోద కార్యక్రమాలకు ఎక్కవ సమయం వెచ్చిస్తారు.

మకరం

ఈ రోజు ఎక్కువగా ఇంట్లో గడపటానికి కానీ, కుటుంబ సభ్యులతో గడపటానికి కానీ ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కుంభం

ఈ రోజు ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. స్త్రీల కారణంగా ఇబ్బంధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు ప్రయాణాల్లో తీసుకెళ్లక పోవటం మంచిది. గృహ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఎక్కువ ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనవకండి.

మీనం

ఈ రోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి మాట అని తర్వాత బాధ పడే అవకాశముంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. మానసింకగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆవేశానికి లోనవకండి.

11040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles