నవంబర్ 11 సోమవారం 2019.. మీ రాశిఫలాలు

Mon,November 11, 2019 06:21 AM

మేషం

ఈ రోజు అదృష్టవంతమైన రోజు. మీ సహోద్యోగులు లేదా పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీపైగౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి విషయంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.

వృషభం

ఈ రోజు ఆరోగ్యం పట్ల శద్ధ అవసరం. కండ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం బారిన పడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వలన అసహనానికి, ఉద్రేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి.

మిథునం

ఈ రోజు ఆహ్లాద కరమైన రోజు. ఎక్కువ సమయం ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాత మిత్రులను కలవడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కానీ, వస్తు లాభం కానీ జరుగుతుంది.

కర్కాటకం

ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి చేయ గలుగుతారు. మిత్రుల సాయం అందుతుంది. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.

సింహం

ఈ రోజు ఆరోగ్య విషయంలో శద్ధ అవసరం. అనవసర మానసిక ఒత్తిడి కారణంగా ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుం ది. ఒత్తిడిలకు దూరంగా ఉండండి.

కన్య

మీ సహోద్యోగులు, పైఅధికారులతో మంచిగా మెలగండి. వారితో గొడవలకు దిగడం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించడానికి ప్రయత్నించడం, కోపావేశాలకు లోనవడం వల్ల అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.

తుల

ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

వృశ్చికం

ఈ రోజు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు వసూలవుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు

ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బువిషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

మకరం

ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశమున్నది.

కుంభం

ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయక, సహకారాలు అందుతాయి.

మీనం

ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ సొంతమవుతుంది.

3922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles