ఏప్రిల్ 11న సెలవు

Sat,March 30, 2019 06:52 AM

11th april 2019 holiday for lok sabha elections

హైదరాబాద్ : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆరోజు సెలవు ప్రకటించింది. పోలింగ్‌కు ముందు రోజైన ఏప్రిల్ 10న, కౌంటింగ్ జరిగే మే 23వ తేదీన అవసరమైనచోట సెలవులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్ జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం, ఏప్రిల్ 10న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పోలింగ్ ఏర్పాట్ల కోసం, మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లకు స్థానికంగా సెలవులు మంజూరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

6611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles