నేడు 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం

Mon,June 17, 2019 09:03 AM

119 bc gurukul schools to inaugurate today

హైదరాబాద్: ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో పాఠశాలను నిర్మించారు. గురుకులాలను ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభిస్తారు. బాలికలకు 63, బాలురకు 56 పాఠశాలలు కేటాయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 280కి బీసీ గురుకులాలు పెరిగాయి. 119 బీసీ గురుకులాల్లో 28,560 విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాలల్లో సకల హంగులు ఉంటాయి. ఐఐటీ, నీట్ కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ విద్యతో పాటు అధునాతనమైన ప్రయోగశాలలు కూడా ఉంటాయి.

784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles